: బంగారు తెలంగాణ అంటే ఫ్యాక్టరీలు మూతపడటమా?: బీజేపీ
నిజామాబాద్ జిల్లా బోధన్, మరో మూడు చోట్ల ఉన్న నిజాం షుగర్స్ కంపెనీ లేఆఫ్ ఇవ్వడం అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. నిజాం షుగర్స్ ను పునరుద్ధరిస్తామని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ... ఇప్పుడు ఫ్యాక్టరీలను మూసివేసే దిశగా అడుగులు వేస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు మండిపడ్డారు. బంగారు తెలంగాణ అంటే ఫ్యాక్టరీలను మూసి వేయడమా? అని ప్రశ్నించారు. మేనిఫెస్టోలో తప్పుడు వాగ్దానాలను చేసి, తెలంగాణ ప్రజలను టీఆర్ఎస్ మోసం చేసిందని విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు నిజాం షుగర్స్ ను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.