: మారిన ప్రకృతి ధర్మం... ఈక్వెడార్ లో పురుషుడికి గర్భం!


ప్రకృతి ధర్మాలు మారిపోతున్నాయి. పురుషుడిగా జన్మించి, ఆపై లింగమార్పిడి చేయించుకున్న ఓ వ్యక్తి గర్భం ధరించి చరిత్ర సృష్టించాడు. ఈ ఘటన ఈక్వెడార్ లో జరిగింది. పుట్టుకతో స్త్రీగా ఉండి లింగమార్పిడి చేయించుకున్న మహిళతో జతకట్టిన ఫెర్నాండో మచాదో తాను గర్భం దాల్చినట్టు ప్రకటించాడు. ప్రపంచంలో ఈ తరహా ఘటనల్లో ఇదే మొదటిదని తెలుస్తోంది. కాగా, వీరిద్దరూ పూర్తి స్థాయి లింగ మార్పిడి కోసం హార్మోనులు తీసుకున్నారని, డెలివరీ సమయంలో ఎటువంటి ప్రమాదం జరిగే అవకాశాలు లేవని వైద్యులు చెబుతున్నారు. కాగా, ఈ ఘటనపై ఇప్పటివరకూ చర్చి లీడర్స్ స్పందించ లేదు. ఇటీవల అమెరికాలో ట్రాన్స్ జండర్ల వివాహాలను చట్టబద్ధం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News