: నన్ను నమ్మండి... డ్రస్సింగ్ రూమ్ ను కోరిన యువరాజ్ సింగ్


భారత క్రికెట్ జట్టులో స్థానం కోల్పోయి, ఆపై దేశవాళీ పోటీల్లో సత్తా చాటి తిరిగి జట్టులోకి వచ్చిన యువరాజ్ సింగ్, డ్రస్సింగ్ రూమ్ తనపై నమ్మకం ఉంచాలని కోరాడు. బ్రిటన్ దినపత్రిక 'ది టెలిగ్రాఫ్'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, తన సహచరుల నుంచి తమకు మద్దతు లభించాలని, అప్పుడే తాను మరింత బాగా ఆడగలనని అన్నాడు. వచ్చే సంవత్సరం ఇండియాలో జరుగనున్న ఐసీసీ వరల్డ్ టీ-20 పోటీల్లో యూవీని జట్టు సభ్యుడిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇక తుది జట్టులో యువరాజ్ ఉంటాడో, లేదో అన్న విషయమై మ్యాచ్ జరిగే ముందు వరకూ సస్పెన్స్ నెలకొనే ఉంటుందనడంలో సందేహం లేదు. తనకు తగినన్ని అవకాశాలు లభిస్తే, సత్తా చాటుతానని యువరాజ్ చెబుతున్నాడు. కాగా, యువీతో పాటు మరో సీనియర్ ఆశిష్ నెహ్రాను సైతం టీ-20 సిరీస్ కు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఎన్ని అవకాశాలు వస్తాయన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే!

  • Loading...

More Telugu News