: పండగ పూట 'సువిధ'లు... ఆర్టీసీ మార్గంలో రైళ్లు!


రానున్న సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లాలని భావించే వారికి పలు రైళ్లలో వెయిటింగ్ లిస్టు కనిపిస్తోంది. బస్సుల్లో సైతం టికెట్ల బుకింగ్ అంతా ముగిసింది. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల పేరిట 50 శాతం అదనపు వసూళ్లకు రంగం సిద్ధం చేయగా, ఇప్పుడు రైల్వే శాఖ సైతం అదే దారిలో నడుస్తోంది. 'సువిధ' పేరిట ప్రీమియం రైళ్లను ప్రవేశపెడుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ ఎం.ఉమాశంకర్ తెలిపారు. ఈ రైళ్లలో చార్జీలు డైనమిక్ ప్రైసింగ్ విధానంలో ఉంటాయి. అంటే, బెర్తులు భర్తీ అవుతున్న కొద్దీ ధర పెరుగుతుంటుంది. చివరి 10 శాతం బెర్తులకు వచ్చే సరికి దాదాపు విమాన టికెట్ చార్జీ అంత చెల్లించాల్సి వుంటుంది. సికింద్రాబాద్ - యశ్వంత్ పూర్ లమధ్య, సికింద్రాబాద్ - కాకినాడల మధ్య సువిధ రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఉమాశంకర్ వివరించారు. డిసెంబర్ 29, జనవరి 5 తేదీల్లో కాకినాడకు, డిసెంబర్ 30, జనవరి 6 తేదీల్లో కాకినాడ నుంచి సువిధ రైళ్లు బయలుదేరుతాయని, జనవరి 17న యశ్వంతపూర్ బయలుదేరే రైలు, 18న యశ్వంత్ పూర్ నుంచి తిరుగు ప్రయాణం అవుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News