: షారూక్ ఖాన్ తో ముఖేష్ అంబానీ డీల్


ఎల్లుండి నుంచి 4జీ తరంగాలను విడుదల చేయనున్న ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో, ప్రచారనిమిత్తం బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ తో డీల్ ను కుదుర్చుకుంది. రిలయన్స్ జియో బ్రాండ్ అంబాసిడర్ గా షారూక్ పనిచేయనున్నారని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతానికి ట్రయల్ రూపంలో తరంగాలను విడుదల చేస్తున్నామని, వచ్చే సంవత్సరం మార్చి నుంచి పూర్తి స్థాయిలో కస్టమర్లకు 4జీ తరంగాలు అందుబాటులో ఉంటాయని సంస్థ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. "నేను వారి బ్రాండ్ అంబాసిడర్ ను. ముఖేష్ అన్న నాకంతా చెప్పారు. వాస్తవానికి జియో పనులన్నీ ముఖేష్ ముగ్గురు బిడ్డలూ పర్యవేక్షిస్తున్నారు. వారంతా కూడా నాకెంతో సన్నిహితులు" అని షారూక్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. కాగా, 27న జరగనున్న ఓ కార్యక్రమంలో తరంగాలను విడుదల చేయనుండగా, ఖాన్ తో పాటు సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ తదితరులు పాల్గొననున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News