: నవ్యాంధ్ర రాజధాని సమీపంలో గ్యాంగ్ వార్... ఇద్దరు యువకుల దారుణ హత్య


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి సమీపంలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో నిన్న రాత్రి గ్యాంగ్ వార్ చోటుచేసుకుంది. మంగళగిరికి చెందిన రెండు గ్యాంగ్ ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో ఇద్దరు యువకులు చనిపోయారు. నిన్న రాత్రి మంగళగిరిలోని నిడమానూరు రోడ్డు రైల్వే గేటు వద్ద మద్యంతో విందు చేసుకున్న హేమంత్, రమేశ్ అనే యువకుల నేతృత్వంలోని రెండు గ్యాంగ్ లు ఆ తర్వాత కలబడ్డాయి. ఈ ఘర్షణల్లో హేమంత్ తో పాటు రమేశ్ కూడా అక్కడికక్కడే చనిపోయాడు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు చింటూ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘర్షణ జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News