: పాక్ ప్రధాని షరీఫ్ కు మోదీ బర్త్ డే విషెస్!
పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు నేటితో 65 ఏళ్లు నిండాయి. పారిశ్రామికవేత్తగానే పాక్ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన షరీఫ్, ఆ దేశ 18వ ప్రధానిగా కొనసాగుతున్నారు. 1949 డిసెంబర్ 25న జన్మించిన షరీఫ్ గతంలోనూ రెండు సార్లు పాక్ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. షరీఫ్ జన్మదినాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ అకౌంట్ లో షరీఫ్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ మోదీ ట్వీట్ ను పోస్ట్ చేశారు. ‘పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు జన్మదిన శుభాకాంక్షలు. షరీఫ్ కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అంటూ మోదీ ట్వీటారు.