: కోరలు చాస్తున్న ఐఎస్... సిరియాలో మరో నగరం ముష్కరుల వశం
ప్రత్యేక రాజ్యస్థాపనే లక్ష్యమంటూ దారుణాలకు ఒడిగడుతున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మరింతగా రెచ్చిపోతోంది. ఇప్పటికే సిరియాలో విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్న ఈ సంస్థ ఉగ్రవాదులు తాజాగా ఆ దేశంలోని మరో నగరాన్ని చేజిక్కించుకున్నారు. సిరియా నగరం డీర్ ఎజ్జార్ ను హస్తగతం చేసుకున్న ఐఎస్ ఉగ్రవాదులు నగరంలో రెండు ఆత్మాహుతి దాడులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలు, అనంతరం చెలరేగిన అల్లర్లలో ప్రభుత్వం తరఫున పోరాడుతున్న 26 మంది సాయుధులు దుర్మరణం చెందారు. భద్రతా బలగాల దాడిలో 12 మంది ఐఎస్ ఉగ్రవాదులు కూడా హతమయ్యారు.