: నా భర్తకు బెయిల్ ఇవ్వండి.. కావాలంటే గృహ నిర్బంధంలో ఉంచండి!: మాజీ ప్రొఫెసర్ సాయిబాబా భార్య!
తన భర్తకు బెయిల్ ఇవ్వాలని, కావాలంటే ఆయన్ని గృహ నిర్బంధంలో ఉంచుకోవచ్చని ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా భార్య వసంత కోర్టుకు విన్నవించారు. వికలాంగుడైన తన భర్త తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, నిషిద్ధ మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో గత ఏడాది ఢిల్లీలో సాయిబాబాను పోలీసులు అరెస్టు చేసి, నాగపూర్ జైల్ కు తరలించారు. అయితే, ఆయన అనారోగ్యం దృష్ట్యా బాంబే హైకోర్టు గతంలో తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ కేసును పరిశీలించిన నాగపూర్ హైకోర్టు బెంచ్ బుధవారం నాడు ఆ మధ్యంతర బెయిల్ ను రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే సాయిబాబా భార్య వసంత తాజాగా కోర్టుకు విన్నవించారు.