: లొంగిపోతున్న నిందితుడిపై కఠారి మోహన్ అనుచరుల దాడి!
చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసుకు సంబంధించి పోలీసుల ఎదుట లొంగిపోతున్న పదో నిందితుడిపై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన చిత్తూరు పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. పదో నిందితుడు మొగలి ఇక్కడి పోలీస్ స్టేషన్ లో లొంగిపోతుండగా కఠారి మోహన్ అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మొగలికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో, పోలీసులు వారిని అడ్డుకుని, అక్కడి నుంచి బయటకు పంపారు. కాగా, సుమారు నెలరోజుల క్రితం చిత్తూరు మేయర్ అనూరాధ, ఆమె భర్త మోహన్ లపై విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేసి, కాల్పులు జరపడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మోహన్ మేనల్లుడు చింటూ రాయల్ పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే.