: షీనాబోరాను గొంతు పిసికి చంపారు: ఎయిమ్స్ వైద్యుల నివేదిక
షీనా బోరా హత్య కేసులో కీలక సాక్ష్యం దర్యాప్తు సంస్థలకు అందింది. షీనా బోరా గొంతు పిసికి చంపడం వల్లే ఆమె ప్రాణాలు పోయాయని అఖిల భారత మెడికల్ సైన్సెస్ (ఏఐఐఎంఎస్) ధ్రువీకరించింది. ఈ మేరకు గురువారం ఒక నివేదికను విడుదల చేసినట్లు ఒక ఆంగ్ల పత్రిక పేర్కొంది. షీనాబోరా గొంతు నులమడం కారణంగానే ఆమె ప్రాణాలు పోయాయని చెబుతున్న ఈ నివేదికను ఏఐఐఎంఎస్ కు చెందిన ఫోరెన్సిక్ మెడిసిన్స్ నిపుణులు సీబీఐకు అందజేశారని పేర్కొంది. కాగా, షీనాబోరా శరీర భాగాలను అటాప్సి నిమిత్తం గత అక్టోబర్ లో ఏఐఐఎంఎస్ కు సీబీఐ అధికారులు అప్పగించారు. కాగా, ఈ కేసులో షీనా బోరా తల్లి ఇంద్రాణి ముఖర్జియా, ఆమె భర్త పీటర్ ముఖర్జియా, మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ ప్రస్తుతం కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.