: ఇదో విచిత్రం ...బైక్ మీద వెళ్తున్న వ్యక్తికి సీట్ బెల్ట్ పెట్టుకోలేదంటూ చలాన్!
మోటార్ బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఆపి, సీట్ బెల్డ్ పెట్టుకోలేదని చలాన్ విధించారు. ఈ విచిత్ర ఘటన హర్యాణాలో చోటుచేసుకుంది. రసీదు మీద కారు నెంబర్ స్థానంలో బైక్ నెంబర్ రాశారు. ఇటీవల గోహ్నా చెక్ పాయింట్ వద్ద బైక్ పై వెళుతున్న ఇద్దరు యువకులను ఆపి లైసెన్స్ లేదని చలాన్ విధించారట. జరిమానా కట్టిన తర్వాత, సీట్ బెల్ట్ లేదని మరో చలాన్ చేతిలో పెట్టారట. ఈ విషయంపై పోలీస్ స్టేషన్ లో బాధిత యువకులు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.