: పెన్నా గ్రూప్ కు బాక్సైట్ కేటాయింపులు చేసింది జగనేని మరిచినట్టున్నారు: లింగారెడ్డి


బాక్సైట్ విషయంలో ఏపీ ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ చేస్తున్న విమర్శలపై రాష్ట్ర సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ లింగారెడ్డి మండిపడ్డారు. బాక్సైట్ అంశంలో ప్రతిపక్ష నేతది ద్వంద్వ వైఖరని మీడియా సమావేశంలో ఆరోపించారు. పెన్నా గ్రూప్ కు బాక్సైట్ కేటాయింపులు చేయించింది జగన్ అన్న విషయం మరిచిపోయినట్టున్నారని చెప్పారు. అందుకు ప్రతిఫలంగా జగతి గ్రూప్ లో పెన్నా గ్రూప్ రూ.68 కోట్లు పెట్టుబడులు పెట్టిందని తెలిపారు. ఇటు కర్నూలులో 304 హెక్టార్ల సున్నపురాయి గనులు పెన్నాకు కేటాయించారని వెల్లడించారు. బంజారాహిల్స్ లో నాలుగు నక్షత్రాల హోటల్ నిర్మాణానికి వైఎస్ సడలింపు ఇచ్చారని, అప్పటి సెటిల్ మెంట్లు ఇంకా పూర్తి కాలేదేమో అందుకే జగన్ ప్రతాప్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుందని లింగారెడ్డి అన్నారు. పెన్నా ప్రతాప్ రెడ్డి ఇకనైనా అప్రూవర్ గా మారాలని సూచించారు.

  • Loading...

More Telugu News