: వైభవంగా ఎంపీ కొనకళ్ల కుమారుడి వివాహం


మచిలీపట్నం టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ కుమారుడు విజయగణపతి వివాహం హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ (రాయదుర్గం)లో వైభవంగా జరిగింది. పెళ్లికుమార్తె మహిత మంత్రి కేఈ కృష్ణమూర్తి బంధువుల కుమార్తె కావడం విశేషం. ఈ వివాహానికి గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీలు మురళీమోహన్, టి.సుబ్బరామిరెడ్డి, నారా లోకేష్, సినీ నిర్మాత దిల్ రాజు తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

  • Loading...

More Telugu News