: పోలీసు శాఖ అతిపెద్ద వైఫల్యం అదే: ఫిల్మ్ డైరెక్టర్ వర్మ!

భారతదేశ నేర చరిత్రలో పోలీసుశాఖ అతిపెద్ద వైఫల్యం గురించి దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. అదేంటంటే, స్మగ్లర్ వీరప్పన్ ను పట్టుకునేందుకు 1200 మంది పోలీసులు 15 ఏళ్ల పాటు చేసిన విఫలయత్నం. భారతదేశ నేరచరిత్రలో పోలీసు శాఖ అతిపెద్ద వైఫల్యం అదేనని వర్మ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. త్వరలో విడుదల కానున్న తన సినిమా 'కిల్లింగ్ వీరప్పన్' గురించి మరో ట్వీట్ లో వర్మ ప్రస్తావించాడు. తన సినిమాను మొట్టమొదట పోలీసులకే చూపిస్తానని, వాళ్ల రియాక్షన్ ఏవిధంగా ఉంటుందో చూడాలని తనకు చాలా ఆసక్తిగా ఉందని పేర్కొన్నాడు. వీరప్పన్ హతమవడానికి కారణం.. ఒక పోలీసు అధికారికి పుట్టిన సరికొత్త ఆలోచనేనని.. ఆ అధికారికి సంబంధించిన కథే కిల్లింగ్ వీరప్పన్ సినిమా అని వర్మ ట్వీట్ చేశారు.