: అమెరికా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్!
అమెరికాకు చెందిన విమానం ఏసీలో సమస్యలు తలెత్తడంతో అత్యవసరంగా దించివేశారు. మెక్సికో నుంచి అట్లాంటాకు బయలుదేరిన డెల్టా ఎయిర్ లైన్స్ విమానంలో ఏసీ పనిచేయలేదు. దీంతో ఇందులోని ఆరుగురు ప్రయాణికులు అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే.. టెక్సాస్ లోని కార్పస్ క్రిస్టి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అప్పటికే ఎమర్జెన్సీ వైద్య బృందం, పబ్లిక్ సేఫ్టి డివిజన్, అగ్నిమాపకదళం అక్కడికి చేరుకుని సిద్ధంగా ఉన్నాయి. సదరు ప్రయాణికులను ఏసీ ఉన్న ప్రాంతాలకు తరలించారు. ఈ విమానంలో 71 మంది ప్రయాణికులు ఉన్నారని, అందులో ఎవరికీ వైద్య చికిత్సలు అవసరం పడలేదని డెల్టా ఎయిర్ లైన్స్ సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు.