: కువైట్ లో 3 వేల మంది విదేశీయుల అరెస్ట్... పలువురు ఇండియన్స్ కూడా!


జీవనోపాధి కోసం కువైట్ వెళ్లిన పలువురు విదేశీయులను ఆ దేశ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. హసవీ, అబ్బాసియా, జ్లీబ్ అల్ షువోఖ్ తదితర ప్రాంతాలపై ఒక్కసారిగా దాడులు జరిపిన సైన్యం సుమారు 3 వేల మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో అత్యధికులను సరైన పత్రాలు లేని వారిగా గుర్తించి అరెస్ట్ చేయగా, అక్రమంగా నివాసం ఉంటున్న 305 మందిని, వివిధ నేరాల్లో వారెంట్లు జారీ అయ్యాయని 63 మందిని, వ్యభిచార నేరం కింద 123 మందిని, కేసుల్లో ఇరుక్కుని పరారీలో ఉన్నారని 299 మందిని అరెస్ట్ చేశారు. దీంతో పాటు డ్రగ్స్ ఆరోపణలు, కాలపరిమితి ముగిసినా దేశం వీడని వారిని అరెస్ట్ చేశారు. వీరిలో పలువురు భారతీయులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News