: అమెరికాలో తగ్గిన క్రూడాయిల్ ఉత్పత్తి, పెరిగిన ధరలు
అమెరికాలో క్రూడాయిల్ ఉత్పత్తి తగ్గిందని వచ్చిన విశ్లేషణలతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. యూఎస్ బెంచ్ మార్క్ వెస్ట్ టెక్సాస్ క్రూడాయిల్ ధర 0.67 శాతం పెరిగి 37.75 డాలర్లకు చేరుకోగా, బ్రెంట్ క్రూడాయిల్ ధర 0.64 శాతం పెరిగి 37.60 డాలర్లకు చేరుకుంది. గడచిన వారం రోజుల వ్యవధిలో ఒపెక్ దేశాల నుంచి ఉత్పత్తి నిదానించడం కూడా ధరలు పెరిగేందుకు కారణమని నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా, నేటి సెషన్లో భారత బాస్కెట్ ముడిచమురు ధర (జనవరి 19న డెలివరీ) క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 64 పెరిగి రూ. 2,491కి చేరుకుంది.