: పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటి విడుదల
ప్రకాశం బ్యారేజీలో నీటిమట్టం పూర్తి స్థాయిలో పడిపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. ఈ రోజు పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీకి 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యారేజీలో 9.6 అడుగుల వరకు నీటిని నిల్వ చేసి గుంటూరు నగరానికి గ్రావిటీపై మంచినీటి సరఫరా చేస్తామని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తెలిపారు.