: విశాఖ కాల్ మనీ నిందితుడు గుడివాడ రామకృష్ణ అరెస్ట్


కాల్ మనీ వ్యవహారంలో కొన్ని రోజుల నుంచి పరారీలో ఉన్న విశాఖ కాల్ మనీ నిందితుడు, టీడీపీ నేత గుడివాడ రామకృష్ణను పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. విశాఖ నుంచి అదృశ్యమైన అతని కోసం కొన్నిరోజులు గాలింపు చేపట్టగా చెన్నైలో ఉన్నట్టు గుర్తించారు. దాంతో నిన్న (బుధవారం) అరెస్టు చేశారు. ఇవాళ నగరానికి తీసుకువచ్చి మీడియా ముందు ప్రవేశపెట్టారు. తన వద్ద అప్పులు తీసుకున్న మహిళలను లైంగికంగా వేధిస్తున్న అతనిపై విశాఖ పట్టణ నాలుగో పోలీస్ స్టేషన్ లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దాని ఆధారంగానే రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News