: ఇంటిలో వదినను చంపేసి బస్టాండ్ లో ఉన్మాది వీరంగం ... మరో వ్యక్తి మృతి
తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో ఓ ఉన్మాది వీరంగం చేశాడు. పిచ్చి తలకెక్కిన ఉన్మాది తన ఇంటిలో సొంత వదినను చంపేసి రోడ్డున పడ్డాడు. చేతిలో ఇనుప రాడ్డు పట్టుకుని నేరుగా బస్టాండుకు చేరుకున్నాడు. బస్టాండులో తనకు ఎదురుపడ్డ ఇద్దరు వ్యక్తులపై ఇష్టారాజ్యంగా దాడికి దిగాడు. ఈ దాడిలో ఆ ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా, వారిలో ఓ వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగానే చనిపోయాడు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు పరుగు పరుగున అక్కడికి వెళ్లారు. అయితే అప్పటికే ఆ ఉన్మాది అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.