: బీజేపీ సీనియర్ నేతల భేటీ... అద్వానీ హాజరు... పలు విషయాలపై చర్చ


బీజేపీ సీనియర్ నేతలు ఢిల్లీలో భేటీ అయ్యారు. మురళీ మనోహర్ జోషి నివాసంలో వీరి సమావేశం కొనసాగుతోంది. అగ్రనేత అద్వానీతో పాటు పలువురు సీనియర్లు ఈ భేటీకి హాజరయ్యారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, పార్లమెంటు సమావేశాలు తదితర అంశాలపై వీరు చర్చిస్తున్నారు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్స్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారం, అరుణ్ జైట్లీపై ఆరోపణలు, సొంత ఎంపీ కీర్తి అజాద్ పై సస్పెన్షన్ అంశాలపై చర్చ జరుపుతున్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత పార్టీలోని సీనియర్లందరినీ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంచేశారు. ఈ క్రమంలో, సీనియర్లు భేటీ కావడం కొత్త పరిణామం.

  • Loading...

More Telugu News