: అయుతం - అద్భుతం, అసలు క్రతువు మొదలు!


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన అయుత మహాచండీ యాగం నభూతో నభవిష్యతి అన్న రీతిలో అద్భుతంగా సాగుతోంది. యాగం ప్రారంభమైన రెండవ రోజున అసలు క్రతువు కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. తొలుత గురు ప్రార్థన, ఆపై గోపూజ, ఏకాదశ న్యాస పూర్వక ద్వి సహస్ర చండీ పారాయణం అనంతరం, వందలాది యజ్ఞ గుండాల్లో రుత్విక్కులు అగ్నిమథనం చేశారు. దీంతో, వేదమంత్రోచ్చారణల మధ్య మహామాతను ఆరాధిస్తూ, సమస్త లోక శాంతికి నిర్వహిస్తున్న యాగం కీలక క్రతువులోకి ప్రవేశించినట్లయింది. కాగా, వేలాదిగా తరలివస్తున్న సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నేడు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రాగా, కేసీఆర్ స్వయంగా ఆహ్వానించి సన్మానం చేశారు. అత్యంత నియమ నిష్టలతో యాగం సాగుతోంది.

  • Loading...

More Telugu News