: తొలుత రాంజఠ్మలానీ, ఇప్పుడు కీర్తీ ఆజాద్, తదుపరి టార్గెట్ శతృఘ్నసిన్హా?
బీజేపీ పార్లమెంట్ సభ్యుడు కీర్తీ ఆజాద్ ను సస్పెండ్ చేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ వైఖరిని తప్పుబట్టారు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ కు ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హెడ్ గా ఉన్నప్పుడు జరిగిన అవకతవకలను ప్రశ్నించినందుకే ఆజాద్ పై సస్పెన్షన్ వేటు వేశారని, ఇక తదుపరి శతృఘ్నసిన్హాపైనా వేటు వేస్తారా? అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. కీర్తీ ఆజాద్ చేసిన నేరమేమిటని ప్రశ్నించిన ఆయన, డీడీసీఏలో అవినీతిని ఎత్తి చూపడమే పాపమైపోయిందని విమర్శించారు. తొలుత రాంజఠ్మలానీని తొలగించారని, ఆపై ఇప్పుడు కీర్తీ ఆజాద్, తదుపరి సిన్హా వరుసలో ఉన్నారని ఆయన అన్నారు.