: కేసీఆర్ ఇప్పటిదాకా నిర్వహించిన యాగాల వివరాలు


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భక్తిశ్రద్ధలు చాలా ఎక్కువ. యాగాలు నిర్వహించడంలో కూడా ఆయనకు ఆయనే సాటి. ఇప్పటి వరకు ఆయన ఎన్నో యాగాలు చేశారు. వాటి వివరాలను ఓ సారి చూద్దాం. * 1997లో తొలిసారి చండీ హవనం * 2005లో ఢిల్లీలోని తన నివాసంలో ఐదు రోజుల పాటు నవగ్రహ మఠం, చండీయాగం (కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు) * 2006లో కొండపాక మండలం మర్పడ్గలోని విజయదుర్గా పీఠంలో సహస్ర చండీయాగం * 2007లో చండీయాగం, సుదర్శన యాగం * 2008లో సిద్ధిపేట కోటిలింగాల ఆలయ ప్రాంగణంలో గాయత్రీ యాగం * 2009లో తెలంగాణ భవన్ లో 27 రోజుల పాటు నక్షత్ర మండల యాగం * 2010లో తెలంగాణ భవన్ లో చండీయాగం * 2011లో ఎంపీ జితేందర్ రెడ్డి ఫామ్ హౌస్ లో శత చండీయాగం * 2015 నవంబర్ 27న నవ చండీయాగం * ప్రస్తుతం తన ఫామ్ హౌస్ లో అయుత చండీ మహాయాగం.

  • Loading...

More Telugu News