: ఇక ఎంపీల వంతు!... వేతనాల రెట్టింపునకు కేంద్రం ప్రతిపాదన


మొన్నటికి మొన్న ఢిల్లీ ఎమ్మెల్యేలు తమ వేతనాలను నాలుగు రెట్లు పెంచుకున్నారు. ఇక తామేమీ తక్కువ తినలేదన్నట్లు పార్లమెంటు సభ్యులు కూడా వేతనాల పెంపు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఎంపీల వేతనాలను రెట్టింపు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వెనువెంటనే ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపింది. వెంకయ్య ప్రతిపాదనలకు అరుణ్ జైట్లీ ఓకే అంటే, వెనువెంటనే లోక్ సభ సభ్యులతో పాటు రాజ్యసభ సభ్యులకు కూడా రెట్టింపు వేతనాలు అందనున్నాయి. ప్రస్తుతం ఎంపీలకు నెలకు రూ.50 వేల వేతనంతో పాటు కార్యాలయం, నియోజకవర్గ అలవెన్సుల కింద రూ.45 వేలు అందుతున్నాయి. తాజా ప్రతిపాదనలకు ఆమోద ముద్ర పడితే ఇకపై ఎంపీల వేతనం రూ.1 లక్ష కానుంది. అదే సమయంలో కార్యాలయం, నియోజకవర్గ అలవెన్సుల రూపంలో మరో రూ.90 వేలు అందనున్నాయి. ఫోన్ బిల్లులు, కారు పెట్రోల్... తదితరాలన్నీ కలిపి ఒక్కో ఎంపీ నెలకు రూ.2.8 లక్షలు దాకా అందుకోనున్నారు.

  • Loading...

More Telugu News