: తెలంగాణలో అత్యవసర సమయాల్లో 112 నెంబర్ కు ఫోన్ చేయాలి!
తెలంగాణలో అత్యవసర వ్యవస్థ ఏర్పాటు కాబోతోంది. ఆరోగ్యపరమైన సమస్య అయినా, ప్రమాదమైనా, నేరమైనా, మరే ఇతర సమస్య అయినా తలెత్తినప్పుడు 112 నంబరుకు ఫోన్ చేస్తే చాలు. ఎమర్జెన్సీ బృందం తక్షణమే స్పందిస్తుంది. ఈ వ్యవస్థను అమలు చేయడానికి మూడు రాష్ట్రాలను కేంద్రం ఎంపిక చేసింది. అందులో తెలంగాణతో పాటు గోవా, గుజరాత్ లు ఉన్నాయి. ఇప్పటికే ఈ తరహా వ్యవస్థ అమెరికాలో విజయవంతంగా అమలవుతోంది. ఈ వ్యవస్థను అమలు చేయడానికి అవసరమైన పరికరాలను కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది. రాష్ట్రాలు అమలు చేయాల్సి ఉంటుంది. తొలుత ఈ మూడు రాష్ట్రాల్లో అమలు చేసిన తర్వాత, దేశ వ్యాప్తంగా ఈ వ్యవస్థను విస్తరింపజేస్తారు. ఈ వ్యవస్థ వల్ల ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.