: కీర్తి ఆజాద్ కు స్వామి మద్దతు... నిజాయతీపరుడిని బీజేపీ వదులుకోవడం సరికాదని వ్యాఖ్య
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అవినీతిపై గళమెత్తి సస్పెన్షన్ కు గురైన ఆ పార్టీ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ కు సొంత పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ సుబ్రహ్మణ్యస్వామి మద్దతుగా నిలిచారు. కీర్తి ఆజాద్ ను నిజాయతీపరుడిగా అభివర్ణించిన స్వామి, అలాంటి నేతను వదులుకోవడం పార్టీకి మంచిది కాదని నేటి ఉదయం వ్యాఖ్యానించారు. అంతేకాక పార్టీ జారీ చేసిన నోటీసులకు సవివరంగా సమాధానం ఇచ్చేలా కీర్తి ఆజాద్ కు సాయం చేస్తానని కూడా స్వామి ప్రకటించారు. ‘‘కీర్తి ఆజాద్ ఇప్పటికీ బీజేపీ నేతే. ఆజాద్ తో మాట్లాడే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఆజాద్ కు సహాయం చేసే హక్కు నాకుంది’’ అని ఆయన పేర్కొన్నారు.