: అమెరికాలో కూడా లేని బుల్లెట్ రైళ్లు మనకు అవసరమా?: మోదీని ప్రశ్నించిన లాలూ
రూ. లక్ష కోట్ల వ్యయంతో ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు 500 కిలోమీటర్ల దూరం బులెట్ రైలును నడపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే దీని నిర్మాణం కోసం జపాన్ తో మోదీ సర్కార్ ఒప్పందం కూడా చేసుకుంది. దీనిపై ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. అమెరికాలో కూడా లేని బుల్లెట్ రైలు ఇండియాకు అవసరమా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. ఓ వైపు దేశంలోని ప్రజలు పేదరికంలో మగ్గుతుంటే, మరోవైపు భారీ బడ్జెట్ తో బుల్లెట్ రైలుకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని లేఖలో లాలూ పేర్కొన్నారు. బుల్లెట్ రైలు వల్ల ఉపయోగం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తక్కువ ఖరీదుకే విమానాల్లో తిరిగే పరిస్థితి ఉన్నప్పుడు ఇది అనవసరమని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్న తరుణంలో... లక్ష కోట్లతో బుల్లెట్ రైలు వైపు మొగ్గు చూపడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను తెలియజేస్తోందని విమర్శించారు.