: మరింతగా పెరగనున్న భారత 'అణు'శక్తి!


భారత్ కు దీర్ఘకాల మిత్రుడిగా ఉన్న రష్యా సహకారంతో ఏకంగా ఆరు న్యూక్లియర్ రియాక్టర్ల నిర్మాణం దిశగా భారత్ కీలక అడుగు వేసింది. భారత్ - యూఎస్ అణు ఒప్పందం తరువాత, రష్యాతో డీల్ కుదరడం ఖాయమైంది. మొత్తం 150 బిలియన్ డాలర్లు (సుమారు రూ. లక్ష కోట్లు) విలువైన ఈ డీల్ ను మోదీ రష్యా పర్యటన సందర్భంగా వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీ ఎల్ఎల్సీతో భారత సర్కారు నేడు సంతకాలు చేయనుంది. ఇందులో భాగంగా వచ్చే ఆరు నెలల వ్యవధిలో ఇండియాకు ఆరు అణు రియాక్టర్లు వస్తాయి. వీటిని గుజరాత్ లో ప్రతిపాదిత పవర్ ప్లాంటులో ఇన్ స్టాల్ చేస్తారు. ప్రస్తుతం భారత అణు విద్యుత్ సామర్థ్యం, సాలీనా 5,780 మెగావాట్లు కాగా, 2032 నాటికి 63 వేల మెగావాట్ల లక్ష్యాన్ని చేరుకునే దిశగా రష్యాతో డీల్ విజయవంతమైన తొలి అడుగని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా, భారత్ తో న్యూక్లియర్ డీల్ వార్తతో వెస్టింగ్ హౌస్ మాతృ సంస్థ తోషిబా కార్పొరేషన్ ఈక్విటీల్లో పెట్టుబడుల సెంటిమెంట్ ను పెంచింది. దీంతో తోషిబా కార్పొరేషన్ వాటాల విలువ 3.3 శాతం పెరిగింది. ఈ డీల్ పై సంతకాలు అయ్యే దాకా స్పందించలేమని తోషిబా అధికారి ఒకరు వెల్లడించారు.

  • Loading...

More Telugu News