: ఢిల్లీలో 'సరి-బేసి' విధానానికి సవరణలు... మహిళలు, సీఎన్జీ కార్లు, బైకుల మినహాయింపు!


జనవరి 1 నుంచి ఢిల్లీలో అమలు కానున్న 'సరి, బేసి' వాహన విధానానికి సవరణలు చేయాలని కేజ్రీవాల్ సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. తొలుత 15 రోజుల పాటు ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయనుండగా, మహిళలు నడిపే వాహనాలు, సీఎన్జీ సర్టిఫికెట్ ఉన్న కార్లు, బైకులను మినహాయించాలని కేజ్రీవాల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీని కాలుష్య భూతం కోరల నుంచి కాపాడే దిశగా తీసుకున్న కీలక నిర్ణయాల్లో వాహనాల సంఖ్యలో చివరి అంకెను బట్టి, రోజు విడిచి రోజు రహదార్లపైకి అనుమతించాలని నిర్ణయం తీసుకోగా, అందుకు పలువురి నుంచి మద్దతు లభించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ, కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ సవరణలను ప్రతిపాదిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నిబంధనలను మీరితే, వాహనాన్ని బట్టి రూ. 2 వేల వరకూ జరిమానా విధించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News