: ఇండియాలో పెరిగిన తత్కాల్ టికెట్ చార్జీలు!
రేపటి నుంచి రైల్వే తత్కాల్ టికెట్ల చార్జీలు పెరగనున్నాయి. ఆదాయాన్ని పెంచుకునే దిశగా ఇప్పటికే రవాణా చార్జీలను పెంచిన భారత రైల్వేలు, ఇప్పుడు ప్రయాణికులపైనా భారం మోపాయి. ప్రస్తుతం స్లీపర్ క్లాస్ లో తత్కాల్ టికెట్ కు రూ. 90 నుంచి రూ. 175 వరకూ అదనంగా చెల్లించాల్సి వుండగా, దాన్ని రూ. 100 నుంచి రూ. 200కు పెంచారు. ఇక ఏసీ-3 టైర్ లో రూ. 250 నుంచి రూ. 350 వరకూ ఉన్న అదనపు ధరను రూ. 300 నుంచి రూ. 400కు, ఏసీ 2 టైర్ లో రూ. 500 వరకూ అదనంగా వసూలు చేయనున్నట్టు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. సెకండ్ క్లాస్ టికెట్లను కొనేవారిపై మాత్రం ప్రస్తుతానికి భారం పడలేదు.