: నిర్విఘ్నంగా కొనసాగుతున్న చండీయాగం... నేడు యాగ క్షేత్రానికి వెంకయ్య, దత్తన్న
విశ్వశాంతిని, తెలంగాణ సస్యశ్యామలాన్ని కాంక్షిస్తూ టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్వహిస్తున్న అయుత మహా చండీయాగం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ సొంత వ్యవసాయ క్షేత్రం (ఫామ్ హౌస్)లో నిన్న ఉదయం వేదమంత్రాల మధ్య ప్రారంభమైన యాగం నేటితో రెండో రోజుకు చేరుకుంది. 1,500 మంది రుత్విక్కులతో జరుగుతున్న యాగం మరో నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. నేడు బీజేపీ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయలు యాగానికి హాజరుకానున్నారు.