: రాజ్ నాథ్ కంటతడి... బీఎస్ఎఫ్ జవాన్లకు నివాళి సందర్భంగా భావోద్వేగానికి గురైన హోం మంత్రి


బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భావోద్వేగానికి లోనయ్యారు. జనం మధ్యలోనే ఆయన కంటతడిని ఆపుకోలేకపోయారు. జేబులోని చేతి రుమాలు తీసి కంట తడి తుడుచుకున్నారు. గంభీరంగా కనిపించే హోం మంత్రి కంటతడి పెట్టడం అక్కడి వారిని కలచివేసింది. ఈ ఘటన నిన్న ఉదయం ఢిల్లీలో చోటుచేసుకుంది. మొన్న విమాన ప్రమాదంలో మృత్యువాతపడ్డ పది మంది బీఎస్ఎఫ్ జవాన్లకు నివాళి అర్పించేందుకు రాజ్ నాథ్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భగా జవాన్ల కుటుంబాలే ఎందుకు ఏడుస్తున్నాయంటూ ఓ బాధిత కుటుంబం రాజ్ నాథ్ ను నిలదీసింది. ఈ సందర్భంగా సదరు కుటుంబ సభ్యులను ఓదార్చిన రాజ్ నాథ్, వారిని అనునయిస్తూనే తాను భావోద్వేగానికి గురయ్యారు. వారితో మాట్లాడుతున్న సందర్భంగానే ఆయన కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. తన చుట్టూ ఉన్న వారిని అసలు పట్టించుకోని రాజ్ నాథ్, బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇస్తూనే జేబులోని చేతి రుమాలు తీసి తన కన్నీళ్లను తుడుచుకున్నారు.

  • Loading...

More Telugu News