: బాంబు దాడులకు యత్నిస్తోందన్న అనుమానంతోనే నకిలీ గర్భవతి అరెస్టు!


నకిలీ గర్భవతిని ఫ్రెంచ్ పోలీసులు అరెస్టు చేశారు. తనకు గర్భం ఉన్నట్లు నటిస్తూ బాంబు దాడులకు యత్నిస్తోందన్న అనుమానంతోనే పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఇటీవలే ఇస్లాం మతంలోకి మారిన ఆమె(23)ను, ఆమె భర్త(35)ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారంతో ఈ జంట నివసించే ఇంటికి వెళ్లిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గర్భిణిగా కనిపించడానికి ఆమె ఉపయోగించే ఒక దిండును పోలీసులు గుర్తించారు. ఈ దిండును ఇంటర్నెట్ లో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ దిండుకు అల్యూమినియం కోటింగ్ ఉందని, ఈ కోటింగ్ ఉన్నవి మెటల్ డిటెక్టర్లకు కూడా దొరకవని, ఆ దిండు లోపల ఎటువంటి వస్తువులనైనా, ముఖ్యంగా బాంబులు లాంటివి దాయవచ్చని ఫ్రెంచ్ పోలీసులు చెప్పారు. ఇటువంటి దిండును బాంబులు దాయడానికే ఉపయోగిస్తారని అన్నారు. అంతేకాకుండా, ఐఎస్ అరాచకాలకు సంబంధించిన దారుణమైన వీడియోలను ఈ జంట చూశారని ఆరోపించారు. ప్రస్తుతానికి వాళ్లిద్దరినీ గృహనిర్బంధంలో ఉంచామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.

  • Loading...

More Telugu News