: అరుణ్ జైట్లీ సిగ్గులేని వ్యక్తి!: ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలాని
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఒక సిగ్గులేని వ్యక్తి అంటూ ప్రముఖ సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలాని తీవ్రంగా విమర్శించారు. జైట్లీని భారతీయ జనతా పార్టీ అగ్రనేత అద్వానీతో పోల్చడంపై కూడా మండిపడ్డారు. జైట్లీపై వందలాది ఆరోపణలు ఉన్నాయని ఆరోపించారు. కేజ్రీవాల్ పై అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం దావా కేసు గురించి కూడా ఆయన ప్రస్తావించారు. కేజ్రీ తరపున తాను ఈ కేసు వాదిస్తున్నానని చెప్పారు. జైట్లీని ప్రాసిక్యూట్ చేయబోతున్నానని అన్నారు. అందరూ తప్పు చేస్తారని, కానీ, తనకు జైట్లీ అంటే ఇష్టం లేదని జెఠ్మలాని పేర్కొన్నారు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) నిధుల అవకతవకలకు జైట్లీ పాల్పడ్డారని సీఎం కేజ్రీవాల్ ఆరోపణలు చేయడం తెలిసిందే.