: రోజాను జగన్ వెనకేసుకురావడం ఎలా ఉందంటే...! : కాల్వ శ్రీనివాసులు వివరణ


మనసు ఒప్పుకోకపోయినా.. అసెంబ్లీలో వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళనకు సంబంధించిన సీడీలను విడుదల చేశామని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు అనుమతితోనే ఈ సీడీలను విడుదల చేశామన్నారు. వైఎస్సార్సీపీ నగరి ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలను ప్రజలు సహించరని, చెవిరెడ్డి భాస్కర రెడ్డి ప్రస్తుతం దీక్షలో ఉండి కూడా అసభ్యకర పదాలు ఉపయోగించారని ఆయన అన్నారు. రావణాసురుడు శూర్పణఖను వెనకేసుకొచ్చినట్లు రోజాను జగన్ వెనకేసుకొస్తున్నారని కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు.

  • Loading...

More Telugu News