: ‘లిబర్టీ’ కూడలి వద్ద అదుపుతప్పిన బస్సు!
హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ వద్ద ఒక కళాశాల బస్సు అదుపుతప్పిన సంఘటనలో ఇద్దరు విద్యార్థులు గాయాలపాలయ్యారు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఇక్కడి లిబర్టీ కూడలి వద్ద జరిగిన ఈ సంఘటనలో కొన్ని వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. రెండు ఆటోలు, రెండు ద్విచక్రవాహనాలు ఈ బస్సు ఢీకొట్టింది. బస్సు ఏ కళాశాలకు చెందింది? బస్సు కండీషన్ లో ఉందా? లేదా? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటనతో వాహనదారులు, పాదచారులు భయభ్రాంతులకు గురయ్యారు.