: మాస్కో చేరుకున్న ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ మాస్కో చేరుకున్నారు. ఆయనకు అక్కడి అధికారులు ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా పర్యటనకు మోదీ వెళ్లారు. అణుశక్తి, హైడ్రోకార్బన్, రక్షణ, వ్యాపార రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగు పరచుకునే అంశాలపై చర్చలు జరపనున్నారు.