: ‘చలో విజయవాడ’లో పాల్గొన్న అంగన్ వాడీల తొలగింపు!
అంగన్ వాడీలపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పూనుకుంది. ఈ నెల 18న ‘చలో విజయవాడ’ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్ వాడీ కార్యకర్తలను విధుల నుంచి సర్కార్ తొలగించింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు స్పెషల్ కమిషనర్ చక్రవర్తి ఆదేశాలు జారీ చేశారు. కాగా, గత కొన్ని నెలలుగా తమకు జీతాలు లేవని, తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 18 వ తేదీన సీఎం క్యాంపు ఆఫీసును ముట్టడించేందుకు అంగన్ వాడీలు ప్రయత్నించారు. విజయవాడలోని స్థానిక బందరు రోడ్డులో వారిని పోలీసులు అడ్డుకోవడం... పరిస్థితి ఉద్రిక్తంగా మారడం తెలిసిందే.