: నా ఫ్యాషన్ చూసి తోటి నటీమణులు తిట్టుకుంటారు: సోనమ్ కపూర్
తన ఫ్యాషన్ చూసి తోటి నటీమణులు తిట్టుకుంటారని బాలీవుడ్ స్టైలిష్ స్టార్ సోనమ్ కపూర్ చెప్పింది. ముంబైలో జరిగిన 'ఫిలింఫేర్ గ్లామర్ అండ్ స్టైల్' అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సోనమ్ మాట్లాడుతూ, ఫ్యాషన్, ట్రెండ్ విషయాల్లో నటీనటులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పింది. ఓ సారి ఓ సీనియర్ నటి తనను చూసి ఎందుకింత ఫ్యాషన్ గా, స్టైల్ గా ఉంటావ్? ఎందుకింత ఖర్చు పెడతావ్? అని ప్రశ్నించారని తెలిపింది. అయితే వాస్తవంగా అంతా అనుకున్నట్టు స్టైల్స్ కోసం తాను ఎక్కువ ఖర్చు చేయనని, తనకిష్టమైనట్టు తయారవుతానని, అవసరం అనుకుంటే తన చెల్లెలి సాయం తీసుకుంటానని సోనమ్ తెలిపింది. ఫ్యాషన్ కి, స్టైల్ కి చాలా తేడా ఉందని, ఫ్యాషనబుల్ గా ఉండడం కంటే స్టైల్ గా ఉండడమే తనకు ఇష్టమని సోనమ్ వెల్లడించింది.