: ఓట్లేయలేదని మతం మార్చుకుంటానంటున్న వ్యక్తి
తమ మతానికి చెందిన వ్యక్తులు తనకు అనుకూలంగా ఓట్లేయలేదని ఓ వ్యక్తి ఇస్లాం మతం తీసుకుంటానని ప్రకటించడం గ్రామస్థులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోరా ప్రాంతానికి చెందిన హర్ పాల్ సింగ్ గ్రామ ప్రధాన్ గా పోటీ చేసి ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఆ గ్రామంలో 800 ముస్లిం ఓట్లు, 500 హిందూ ఓట్లు ఉన్నాయి. ఎన్నికల ముందు తమ ఓట్లన్నీ నీకే అని చెప్పిన గ్రామస్థులు తనను మోసం చేశారని, తన ప్రత్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాను ఇస్లాం పుచ్చుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. తన మతస్థులను నమ్మినందుకు ప్రయోజనం లేనప్పుడు, తనకు మాత్రం ఆ మతం ఎందుకు? అని ఆయన ప్రశ్నిస్తున్నారు.