: బైబిల్ పట్టుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు: జగన్ పై మంత్రి కిషోర్ బాబు పరోక్ష విమర్శలు
చేతిలో బైబిల్ పట్టుకుని కొందరు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఏపీ మంత్రి రావెల్ కిషోర్ బాబు ఆరోపించారు. క్రైస్తవులం అని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేశారని పరోక్షంగా వైకాపా అధినేత జగన్ ను ఉద్దేశించి విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరి క్రైస్తవుల గురించి ఆలోచించిన నేత మరెవరూ లేరని అన్నారు. ఈరోజు గుంటూరులో క్రైస్తవ భవన్ కు చంద్రబాబు శంకుస్థాపన చేసిన సందర్భంగా రావెల మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవులకు ఇచ్చిన హామీ మేరకు భవనాన్ని చంద్రబాబు ఇచ్చారని తెలిపారు.