: కేఎఫ్ సీ ఆహారంలో పురుగులు!


మల్టీ నేషనల్ బ్రాండ్ కేఎఫ్ సీ ఆహారంలో మళ్లీ పురుగులు కనిపించాయి. ఈసారి ఈ సంఘటన అమెరికాలోని బిషప్ ఆక్లాండ్ లోని దుర్హాం ప్రాంతంలో చోటు చేసుకుంది. జెన్నిఫర్ ఆల్డెర్సన్ అనే మహిళ తన కూతురు లిడియా హోనేతో కలిసి ఇక్కడి కేఎఫ్ సీ అవుట్ లెట్ కు వెళ్లింది. చికెన్ పాప్ కార్న్ మీల్ కోసం ఆర్డర్ ఇచ్చారు. కొద్ది నిమిషాలకు వారు చెప్పిన ఐటమ్ రావడంతో హోనే తినడానికి ఉపక్రమించింది. ఇంతలో ఆ పాప్ కార్న్ లో ఓ పురుగు కనిపించింది. అది చూసిన హోనే, ఆమె తల్లి ఆశ్చర్యపోయారు. దీంతో, కేఎఫ్ సీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఇటువంటి సంఘటనే గతంలో కూడా జరిగిందంటూ అక్కడే ఉన్న ఒక మహిళ చెప్పడంతో సదరు సిబ్బందిపై జెన్నిఫర్ మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంఘటనపై కేఎఫ్ సి సిబ్బంది స్పందిస్తూ, ఇందులో తమ తప్పేమి లేదని..మొక్కజొన్న వంటి ఉత్పత్తుల విషయంలో అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందని, గింజల లోపల పురుగులు ఉండటం కారణంగా ఈ విధంగా జరిగి ఉండవచ్చని చెప్పి, సిబ్బంది వారికి క్షమాపణలు తెలిపారు.

  • Loading...

More Telugu News