: విశాఖలో ఆరేళ్ల చిన్నారి అదృశ్యం
విశాఖపట్నంలో ఆరేళ్ల వయసున్న చిన్నారి దివ్య అదృశ్యమయింది. విశాఖ సమీపంలో ఉన్న దేవరాపల్లికి చెందిన దివ్య నిన్న స్కూలుకు వెళ్లింది. సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి రాలేదు. దీంతో, బంధువుల దగ్గర, తెలిసిన వారి దగ్గర వాకబు చేశారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో, నిన్న స్కూలుకు వెళ్లిన తమ చిన్నారి దివ్య ఇంతవరకు ఇంటికి రాలేదంటూ కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు చిన్నారి మేనమామ శేఖర్ పై అనుమానం కలిగింది. దీంతో, అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు జాగిలాలతో గాలింపు చర్యలు చేపట్టారు.