: వారు పడే హింసల ముందు ఈ ప్రాణాలు ఒక లెక్కా?: 'ఐఎస్ఐఎస్' హిట్ లిస్టులో ఉన్న మహిళా ఎంపీ


తన సోదర మహిళలు పడే బాధల ముందు ఈ ప్రాణాలు ఒక లెక్కా? అని ఇరాక్ దేశపు ఎంపీ వియాన్ డాకిలే అభిప్రాయపడ్డారు. ఇరాక్ లో ఎంపీలుగా ఉన్న ఇద్దరు యాజాదీ మహిళలలో ఆమె ఒకరు. అంతేకాదు, ఐఎస్ఐఎస్ హిట్ లిస్టులో తొలి ప్రాధామ్యాల లిస్టులో ఉందామె. ఆమె సోదరి డీలన్ డాకిలే ఐఎస్ఐఎస్ దురాగతాలకు బలైన మహిళలకు సేవలందిస్తున్న శిబిరాల్లో వైద్యురాలిగా సేవలు చేస్తున్నారు. వీరిద్దరూ ఐఎస్ఐఎస్ హిట్ లిస్టులో ఉన్నవారే కావడం విశేషం. హిట్ లిస్టు గురించి వీరిదగ్గర మాట్లాడితే..."సిగరెట్ పెట్టె కోసం మహిళలను అమ్ముతున్నారు. పదేళ్లు నిండని బాలికలు దారుణమైన అత్యాచారాలకు గురై తీవ్ర రక్తస్రావంతో మరణిస్తున్నారు. బానిసలుగా, సెక్స్ బొమ్మలుగా వందలు, వేల సంఖ్యలో యాజాదీ మహిళలు బాధలు అనుభవిస్తున్నారు. అలాంటి వారితో పోల్చుకుంటే మా ప్రాణాలకు అంత విలువైనవి కాదు. వాటి గురించి మరీ బాధపడడం అనవసరం" అని పేర్కొంటున్నారు. లండన్ లో జరిగిన మానవ హక్కుల సమావేశంలో ఐఎస్ఐఎస్ బారిన పడి తప్పించుకున్న పలువురు యాజాదీ మహిళలను తీసుకొచ్చింది వీరిద్దరే. ఆ సమావేశం సాక్షిగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను అంతమొందించాల్సిందేనని వియాన్ డాకిలే, డీలన్ డాకిలే పిలుపునిచ్చారు. ప్రాణమున్నంత వరకు యాజాదీ మహిళల రక్షణ కోసం పని చేస్తామని వీరు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News