: మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేయవద్దు: కాంగ్రెస్ సభ్యులను హెచ్చరించిన సోనియా


ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ తన దూకుడు పెంచింది. లోక్ సభలో కేవలం 45 మంది సభ్యులే ఉన్నప్పటికీ, వెల్ లోకి దూసుకెళ్లడం, సభలో గందరగోళం సృష్టించడం వంటి కార్యక్రమాలతో అధికారపక్షాన్ని ఇరకాటంలో పెట్టింది. కాంగ్రెస్ సభ్యుల తీరు వల్ల సభ అనేక సార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో సమావేశాల చివరి రోజైన నేడు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదురి వెల్ లోకి దూసుకెళ్లి, ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. వెంటనే కలగజేసుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆయనను వారించారు. అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నప్పుడు... ప్రధాని మోదీ పేరును ప్రస్తావించవద్దని స్పష్టం చేశారు. దీంతో, కాంగ్రెస్ సభ్యులు సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత ప్రధాని మోదీ సభలో ఉన్న సమయంలో కూడా ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేయలేదు. అనంతరం ఈ మధ్యాహ్నం రష్యా పర్యటనకు మోదీ బయలుదేరి వెళ్లారు.

  • Loading...

More Telugu News