: 12 వేల కోట్ల నల్లధనాన్ని స్వాధీనం చేసుకుని 774 కేసులు పెట్టాం: రెవెన్యూ కార్యదర్శి
2014 మార్చి నుంచి 2015 నవంబర్ వరకు చేసిన దాడుల్లో 16 వేల కోట్ల రూపాయల నల్లధనాన్ని గుర్తించినట్టు రెవెన్యూ కార్యదర్శి హస్ ముఖ్ అధియా తెలిపారు. 20 నెలల్లో 16 వేల కోట్ల రూపాయలు గుర్తించి, అందులో 12 వేల కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని, ఈ వ్యవహారంలో మొత్తం 774 కేసులు నమోదు చేశామని ఆయన వెల్లడించారు. నల్లధనంపై ప్రభుత్వం కఠినంగా ఉందని, నల్లధనాన్ని వెనక్కి తెప్పించేందుకు ఏర్పాటు చేసిన విండో ద్వారా 4,160 కోట్ల రూపాయలు స్వాధీనమయ్యాయని ఆయన తెలిపారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు.