: ఇంతకీ శింబు పాటను అప్ లోడ్ చేసిన నటుడెవరు?
తమిళనాట శింబు బీప్ సాంగ్ పెను వివాదం రాజేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాటను తానే పాడానని, అయితే దానిని తాను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయలేదని శింబు స్పష్టం చేశాడు. ఆ పాటను శింబు రాసి, పాడగా, బాణీలు సమకూర్చింది మాత్రం సంగీత దర్శకుడు అనిరుధ్. ఈ పాటను అనిరుధ్ తన స్నేహితుడైన ఓ ప్రముఖ నటుడికి పంపించాడట. ఆ ప్రముఖ నటుడు దానిని సరదాగా వాట్స్ యాప్ లో మిత్రులకు పంపాడట. ఇది అలా అలా సోషల్ మీడియాలోకి పాకింది. దీంతో పెను వివాదం రేగింది. కాగా, ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులు, ఆ పాటను అనిరుధ్ ఎవరికి పంపాడు? ఆ పాటను సోషల్ మీడియాలోకి ఎవరు అప్ లోడ్ చేశారు? అనే విషయాలను ఆరా తీయడంలో బిజీగా ఉన్నారు.