: ‘హిందూ’ అంటే మతం కాదు... అదో జీవన విధానం: ముస్లిం ‘కర’ సేవకుడి సరికొత్త నిర్వచనం


రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్...సంక్షిప్తంగా ఆరెస్సెస్. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ సంస్థపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ తరహా చర్చ ఇప్పుడే కాదు... గతంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడూ జరిగింది. బీజేపీ అగ్రనేతలంతా ఆరెస్సెస్ భావజాలమున్న నేపథ్యంలో ఈ చర్చ జరుగుతోందన్నది జగమెరిగిన సత్యం. ఆరెస్సెస్ ను ఇతర రాజకీయ పార్టీలు సహా ఇస్లామిక్ మతచాందసవాదులు హిందువుల సంస్థగా అభివర్ణించడం కూడా మనకు తెలిసిందే. అయితే ఆరెస్సెస్ లోనూ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారూ ఉన్నారు. అలాంటి ఓ ముస్లిం కరసేవకుడు ‘హిందూ’, ‘హిందూ రాష్ట్ర’ అంటే ఏమిటన్న వాదనకు సరికొత్త నిర్వచనం చెప్పారు. భారత దేశాన్ని హిందూ రాష్ట్రంగా అభివర్ణించిన సదరు కర సేవకుడు, హిందూ రాష్ట్రంలో అంటే, భారత్ లో పుట్టి పెరిగిన ప్రతి వ్యక్తి హిందువేనని తేల్చిచెప్పారు. అంతేకాక ‘హిందూ’ అంటే మతం కాదని చెప్పిన ఆయన, అదో జీవన విధానమని పేర్కొన్నారు. ‘‘నేనో ముస్లింను. ఇస్లాం మతాన్నే ఆచరిస్తాను. అయితే నేను గొప్ప సంస్కృతి, సంప్రదాయం, నాగరికత కలిగిన ఈ దేశ పౌరుడిని’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News